100 కోట్లతో రజినీకాంత్ కొత్త సినిమా

100 కోట్లతో రజినీకాంత్ కొత్త సినిమా

Published on Feb 25, 2013 1:00 PM IST

Rajinikath

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలియజేసింది. ఈ సినిమా దాదాపు గా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.
ఈ విషయాన్ని విన్న రజినీకాంత్ అబిమనులు చాలా సంతోషంగా వున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ ‘కోచాడియాన్’ సినిమాతో బిజీగా వున్నారు. రజినీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాకు కె.వి. ఆనంద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. గత కొద్ది కాలంగా రజినీకాంత్ మార్కెట్ విలువ చాలా పెరిగిపోవడంతో 100 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మించినా నిర్మాతలు భయపడవలసిన అవసరం లేదు.

తాజా వార్తలు