ప్రభాస్ ను ‘బాహుబలి’ గా చూపిస్తూ మొదటి మేకింగ్ వీడియోను విడుదల చేసారు. దానికి వచ్చిన స్పందనతో రాజమౌళి ఆనందంగా వున్నాడు. ఇప్పుడు పవన్ అత్తారింటికి దారేది సినిమా మగధీర షేర్ ను క్రాస్ చేసినందుకు ఆనందంగా వున్నాడు
“ఒక మంచి సినిమా అంటూ తీయగలిగితే తెలుగు సినిమాకు 100కోట్లు సంపాదించగలిగే శక్తి వుందని ఐదేళ్ళ క్రితం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆ ఫీట్ ను అత్తారింటికి దారేది సొంతం చేసుకుంది. ఇంతటి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాకు పవన్ అభిమానులకు కృతజ్ఞతలు” అని ట్వీట్ చేసాడు
పైరసీ వలన సినిమాల లాభాలు పోకుండా త్వరగా జాగ్రత్తపదాలని తెలిపాడు/ఒకవేళ పైరసీ భూతం గనుక ఈ సినిమాను తాకకపోతే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవని అభిప్రాయపడ్డాడు