రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ క్లాసికల్ డాన్సర్ గా కనిపించనుందని.. పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా కరోనా అనంతరం మొదలు పెట్టబోయే షెడ్యూల్ లో పూజా హెగ్డే పార్ట్ కి సంబంధించిన సీన్స్ నే తీయబోతున్నారట.
కాగా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు. ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కూడా రెండు గెటప్స్ లో కనిపిస్తారట. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.