“రాధే శ్యామ్” టీం ఆ పనిలో ఉన్నారా?

“రాధే శ్యామ్” టీం ఆ పనిలో ఉన్నారా?

Published on Sep 17, 2020 5:01 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “సాహో” తర్వాత ఈ చిత్రం వస్తుండడంతో ఈ సినిమాపై కూడా అదే విధంగా పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం మొదలయ్యి చాలా కాలమే అయినప్పటికీ కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న అప్డేట్లను మాత్రమే చిత్ర యూనిట్ వదిలారు. అయితే రాబోయే రోజుల్లో వీరికి ఒక బిగ్ డే రోజున బిగ్ టాస్క్ ఉంది. అదే వచ్చే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. ఏది ఏమైనప్పటికీ మాత్రం అది ప్రభాస్ అభిమానులకు సిసలైన రోజు.

మరి ఆరోజుకు ఖచ్చితంగా పెద్ద ఫీస్టే ఉండాల్సి వస్తుంది. అందులో భాగంగా రాధే శ్యామ్ యూనిట్ టీజర్ ను కట్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఎడిటింగ్ వర్క్ లో ఉన్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే టీజర్ కు జిబ్రానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించే సూచనలు ఉన్నాయట. ప్రస్తుతానికి గాసిప్ లా వినిపిస్తున్న ఈ వార్త మరి డార్లింగ్ పుట్టినరోజు కల్లా నిజమవుతుందో లేదో చూడాలి.

తాజా వార్తలు