సెప్టెంబర్ కన్ఫ్యూజన్ కంటిన్యూ.. తారుమారు అవుతున్న రిలీజ్ డేట్స్!

సెప్టెంబర్ కన్ఫ్యూజన్ కంటిన్యూ.. తారుమారు అవుతున్న రిలీజ్ డేట్స్!

Published on Aug 23, 2025 4:59 PM IST

Movie Release Dates

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు సెప్టెంబర్ నెలలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే, సెప్టెంబర్ లో రాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో మేకర్స్ తడబడుతున్నారు. ఫలితంగా పలు చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఇందులో పలు క్రేజీ చిత్రాలు కూడా ఉండటం గమనార్హం.

సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోయే సినిమాల్లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన సినిమా ‘మిరాయ్’. ఈ సినిమాను తొలుత సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాను ఆ తేదీన రిలీజ్ చేయలేరని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను ఒకట్రెండు వారాల వెనక్కి జరిపేందుకు మేకర్స్ రెడీ అయ్యారట.

ఇక ఈ ఛాన్స్‌ను వినియోగించుకోనుంది ఓ చిన్న సినిమా. #90s ఫేమ్ మౌళి టాక్స్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ను సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర మేకర్స్ రెడీ అయ్యారు. అయితే, అదే రోజున అనుష్క శెట్టి ఘాటి కూడా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

అటు తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన మదరాసి చిత్రాన్ని కూడా సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అటు ఆగస్టు 27న రావాల్సిన రవితేజ ‘మాస్ జాతర’ చిత్రాన్ని కూడా సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ఏ డేట్ ఫిక్స్ చేయలేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజి’ మాత్రం అనుకున్నది అనుకున్నట్లుగా సెప్టెంబర్ 25న సన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతుంది.

తాజా వార్తలు