పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇపుడు వందల కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన సినిమా అది కూడా ఒక యానిమేషన్ సినిమా ఇప్పటికీ దాని దండయాత్ర కొనసాగిస్తుంది. మరి ఆ చిత్రమే “మహావతార్ నరసింహ”. ఇండియన్ సినిమా దగ్గర చాలా తక్కువగా వచ్చే ఈ యానిమేషన్ చిత్రాల్లో ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఈ వారాంతం దాటితే థియేటర్స్ లోకి వచ్చి నెల అయ్యిపోతుంది.
మరి ఈ నెల రోజుల్లో కూడా ఈ డామినేషన్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పి తీరాలి. ఈ తర్వాత చాలానే పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పటికీ ఆడియెన్స్ ఈ సినిమాకి వాటిని మించి బ్రహ్మ రథం పడుతున్నారు. మరి ఈ వారాంతంలో కూడా కూలీ, వార్ 2 లని మించి మహావతార్ నరసింహ చిత్రానికే సాలిడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. దీనితో మహావతార్ నరసింహ హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.