అక్కడ ఆట షురూ చేస్తున్న ‘ఓజి’.. ఇక రికార్డులు మాయం కావడం ఖాయం..!

అక్కడ ఆట షురూ చేస్తున్న ‘ఓజి’.. ఇక రికార్డులు మాయం కావడం ఖాయం..!

Published on Aug 23, 2025 11:00 PM IST

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకుడు సుజిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ గ్యాంగ్‌స్టర్ చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఈ సినిమాను సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ చిత్రం కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఆతృతగా ఉన్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ టికెట్ బుకింగ్స్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఓజి టికెట్ బుకింగ్స్ ఆగస్టు 29 నుంచి ఓపెన్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంలా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు