టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?

టాక్.. ‘అఖండ 2’ పై క్లారిటీ ఆరోజున?

Published on Aug 23, 2025 9:01 PM IST

Akhanda-2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే ‘అఖండ 2’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ పట్ల మంచి ఆసక్తి నెలకొనగా ఈ సెప్టెంబర్ 25న మాత్రం థియేటర్స్ లో వచ్చే సూచనలు ఇపుడు మరింత సన్నగిల్లుతున్నాయి.

ఇక దీనిపై ఓ క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీనిపై ఈ నెక్స్ట్ వీక్ లోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందట. ముఖ్యంగా 25 నుంచి 27 తేదీల్లో విడుదలపై ఏదొక క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే విఎఫ్ఎక్స్ పనులు అఖండ 2 కి ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని తెలుస్తుంది. సో అఖండ 2 విషయంలో క్లారిటీ కోరుకుంటున్న వారికి ఇంకొన్ని రోజులు ఆగితే విషయం ఏంటి అనేది తేలిపోతుంది.

తాజా వార్తలు