“రాధే శ్యామ్” టీం అతన్ని లాక్ చేసిందా?

“రాధే శ్యామ్” టీం అతన్ని లాక్ చేసిందా?

Published on Aug 19, 2020 2:50 PM IST

ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో మొదటిది “రాధే శ్యామ్”. జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అయితే ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం ఇంకా కొంత షూటింగ్ ను బ్యాలన్స్ ఉంచుకుంది.

పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ ఆరంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అంశం మాత్రం ఎప్పటి నుంచో సస్పెన్స్ గా కొనసాగుతూ వస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి చాలా విషయాలను వెల్లడించిన టీమ్ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రమే క్లారిటీ ఏదన్నది చెప్పలేదు.

అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి రాధే శ్యామ్ టీం సాహో టెక్నిషియన్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఆ చిత్రానికి అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చిన జిబ్రాన్ ను ఈ చిత్రానికి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేందుకు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు