‘రాధే శ్యామ్’ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే !

‘రాధే శ్యామ్’ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే !

Published on Aug 23, 2020 7:15 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా వచ్చే నెల నుండి షూటింగ్ రెడీ అవుతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హాల్ చల్ చేస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో.. కరోనా నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారని అక్కడే షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

కాగా జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ నే మొదట మొదలు పెడతారట. ఇక మిగిలిన షూటింగ్ మొత్తం దాదాపు ఫిల్మ్ సిటీలోనే తీస్తారట.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు