“రాధే శ్యామ్” విడుదల అప్పుడేనా?

“రాధే శ్యామ్” విడుదల అప్పుడేనా?

Published on Aug 20, 2020 7:25 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. అద్భుతమైన ప్రేమ కథతో అంతకు మించిన ఎమోషన్స్ తో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కావడానికి సన్నద్ధం అవుతుంది. అయితే ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలు పెట్టి ఈ ఏడాది ఆఖరులోపలే పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం పరిస్థితులు కనుక బాగున్నట్టయతే వచ్చే ఏడాదిలోనే ప్లాన్ చేస్తున్నట్టు బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి రేస్ లో నిలవనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఇప్పటికే మన టాలీవుడ్ లోని అన్ని చిత్రాలు తిరిగి షూటింగ్ పునః ప్రారంభం కావడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈ చిత్రాలు అన్ని ఎలా ఏ టైం లో విడుదల అవుతాయో అన్నది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు