“రాధే శ్యామ్” షూట్ అప్పటి నుంచేనా.?

“రాధే శ్యామ్” షూట్ అప్పటి నుంచేనా.?

Published on Aug 20, 2020 7:03 AM IST

ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ ప్రాజెక్టులను లైన్ లో ఉంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిలో మొదటి వరుసలో ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీలో ఇంకా కొంత షూటింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు పరిస్థితులు అంత బాగోకపోవడంతో షూట్ ఎప్పుడు మొదలు అవుతుందో అన్నది కాస్త అర్ధం కాని విధంగా మారింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ షూట్ మళ్లీ అక్టోబర్ నెల మధ్య నుంచి మొదలయ్యి డిసెంబర్ వరకు రెగ్యులర్ గా జరగనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు