పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. దేశ వ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి ఇక వరుస అప్డేట్స్ రానున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ కు గాను మేకర్స్ ఇటీవల డేట్ ను లాక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం నాడు తాము తెరకెక్కించిన అందమైన పెయింటింగ్ లాంటి సినిమా టీజర్ ను విడుదల చేస్తామని తెలిపారు.
అయితే ఇప్పుడు మరి ఆ రోజున ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఏ సమయానికి విడుదల చేస్తారో అన్నది రివీల్ చేశారు. ప్రభాస్ ది ఒక అమేజింగ్ పోస్టర్ తో వింటేజ్ లుక్ లో ఆ తరహా డ్రెస్సింగ్ లో సింపుల్ అండ్ క్లాస్ గా ఉన్న పోస్టర్ తో ఈ ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ఈ టీజర్ ను విడుదల చెయ్యనున్నట్టుగా తెలిపారు.
అయితే ఇది చూసాక మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు తన లుక్స్ పరంగా ఫీస్ట్ ఖాయం అనేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు. అలాగే యూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేయడం విశేషం.