అంచనాలు పెంచిన “రచ్చ”


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన “రచ్చ” బాక్స్ ఆఫీస్ వద్ద అద్బుతమయిన ఓపెనింగ్స్ తో దూసుకుపోతుంది. దీనితో రామ్ చరణ్ రాబోయే చిత్రం మీద అంచనాలను మరింత పెరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. కాజల్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించబోతుంది. ఈ చిత్రం వినోదాత్మకంగా మలిచేందుకు వి వి వినాయక్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ పాత్ర ఆసక్తికరంగా ఉండబోతుంది. “మగధీర” వంటి భారీ చిత్రం తరువాత కాజల్ రామ్ చరణ్ సరసన నటించడం కూడా ఈ చిత్రం మీద అంచనాలు పెరగడానికి మరో కారణం.

Exit mobile version