బ్యాచిలర్ పార్టీ నేపధ్యంలో రేస్

బ్యాచిలర్ పార్టీ నేపధ్యంలో రేస్

Published on Oct 19, 2012 12:00 PM IST


బ్యాంకాక్లో బ్యాచిలర్ పార్టీ జరుపుకోవడానికి వెళ్ళిన నలుగురు యువకులు అక్కడ ఎలాంటి సంఘటనలను ఎదుర్కున్నారు అన్న కథాంశంతో ఒక చిత్రం రూపొందుతుంది. విక్రం,దిశ పాండే లు హీరో హీరొయిన్లు గా వస్తున్న “రేస్” చిత్రంలో మంచి ఆసక్తికరమయిన కథ కథనాలు ఉంటాయని దర్శకుడు తెలిపారు. అన్నే రవి ఈ చిత్రాన్ని ఆనంద్ సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్,భరత్ కిషోర్, నిఖిత నారాయణన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అత్యధిక భాగం బ్యాంకాక్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ నెలాఖరులో పాటలను నవంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. వివేక్ సాగర్ మరియు సంజయ్ లు సంగీతం అందించిన ఈ చిత్రానికి ఎస్ మురళి మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

తాజా వార్తలు