యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘రభస'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఆరోగ్యం దెబ్బ తినడంతో షూటింగ్ వాయిదా పడింది. అనుకున్న దాని ప్రకారం అయితే హోలీ తర్వాత ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాలి.
కానీ ముందుగా అనుకున్న షెడ్యూల్ వాయిదా పడడంతో సమంత డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఈ షెడ్యూల్ ఏప్రిల్ 4కి వాయిదా పడిందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం ఉగాది కానుకగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. బెల్లం కొండ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.