“పుష్ప” విషయంలో అదిరిపోయే కాన్ఫిడెన్స్.!

“పుష్ప” విషయంలో అదిరిపోయే కాన్ఫిడెన్స్.!

Published on Feb 11, 2021 3:00 PM IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇంతకు ముందు సుకుమార్ కానీ బన్నీ కానీ టచ్ చెయ్యని నేపథ్యంలో దీనిపై భారీ అంచనాలే సెట్టయ్యాయి. అయితే మరి ఈ కాంబో అన్నాకే అంచనాలు మామూలుగా ఉండవు కానీ వాటికి మించే స్థాయిలో ఈ సినిమా ఉండబోతుంది అన్నట్టుగా క్లారిటీ వస్తుంది. లేటెస్ట్ గా నిర్మాతలు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలే వెల్లడించారు.

ఈ చిత్రంతో సుకుమార్ లోని కొత్త కోణం చూస్తారని అల్లు అర్జున్ కానీ సుకుమార్ ల నుంచి కానీ సరికొత్త అల్లు అర్జున్ సుక్కులను చూస్తారని అంతా చాలా కొత్తగా ఉంటుంది అని అంతే సూపర్ కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు. దీనిని బట్టి పాన్ ఇండియన్ లెవెల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా అదరగొడుతుందనే చెప్పాలి. మరి ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు