‘పుష్ప’ ఫస్ట్ షెడ్యూల్ డిటైల్స్ !

‘పుష్ప’ ఫస్ట్ షెడ్యూల్ డిటైల్స్ !

Published on Aug 22, 2020 6:33 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ను నవంబర్ నుండి స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి వుంది. దాంతో మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో స్టార్ట్ చేస్తారట.

ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. పైగా సుకుమార్ – దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇక ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ పై సోలో సీన్స్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ను ఫైనల్ చేసిందట చిత్రబృందం. అలాగే తమిళ హీరో విజయ్‌ సేతుపతి కూడా ఈ సినిమా నుండి తప్పుకోవడంతో మాధవన్ ను తీసుకోవాలనుకునట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు