ధ్వంసమైన పూరి జగన్నాథ్ ఆఫీస్.!

ధ్వంసమైన పూరి జగన్నాథ్ ఆఫీస్.!

Published on Oct 19, 2012 3:31 PM IST


‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి మరియు తెలంగాణా వాదులకి మధ్య జరుగుతున్న గొడవలు బాగా ఎక్కువయ్యాయి. తెలంగాణా వాదులు తెలంగాణా నినాదాలు చేసుకుంటూ ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడి ఫర్నిచర్, కంప్యూటర్లు మరియు నాలుగు కార్లను నాశనం చేసారు. ఈ సినిమనైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మరియు పూరి జగన్నాథ్ కలిసి అవసరమైతే అలాంటి సన్నివేశాలను తొలగిస్తామన్నారు. పగలగొట్టిన కార్లలో ఒకటి దిల్ రాజుది , ఒకటి పూరిది, ఒకటి దానయ్యది మరియు ఒకటి ఎడిటర్ కారు. ఈ విషయం పై కొత్త రూల్స్ తీసుకురావాలని ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ కొత్త రూల్స్ ఏమి ఉంటాయని ఎదురుచూస్తున్నాం. మాకు తెలియగానే ఈ చిత్ర పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.

తాజా వార్తలు