విలక్షణ దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం ‘దేవుడు చేసిన మనుషులు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మాస్ మహారాజ రవితేజ మరియు ఇలియానా నటిస్తున్న ఈ చిత్రం పబ్లిసిటీకి దూరంగా ఉంటూ బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతూ ఈ సమ్మర్ సీజన్లో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. పూరి జగన్నాధ్ మరియు రవితేజ డైరెక్షన్లో వచ్చిన ఈడియట్ ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాని కూడా అదే స్థాయిలో పూరి జగన్నాధ్ తీర్చిదిద్దుతున్నట్లు చెబుతున్నారు. జూన్ ద్వితీయార్ధంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నారు.