‘బిజినెస్ మేన్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరి

‘బిజినెస్ మేన్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరి

Published on Oct 17, 2012 7:30 PM IST


మన టాలీవుడ్లో ఒక సినిమా హిట్ అయితే తమ తర్వాతి సినిమాలకు అదే విధంగా పేర్లు పెట్టడం, హిట్ అయిన సినిమా తీసిన ఏరియాలోనే మళ్ళీ సినిమా తీయడం ఇలా రకరకాల సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. ఈ సెంటిమెంట్ ని హీరోలు, దర్శకులు మరియు నిర్మాతలు అని తేడా లేకుండా అందరూ ఫాలో అవుతున్నారు. తాజాగా ఇందులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చేరారు. ఆయన మహేష్ బాబు తో తీసిన ‘బిజినెస్ మేన్’ సినిమాని నర్సీ పట్నంలో చూసారు. ఆప్పుడు ఆ సినిమా భారీ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఇదే సెంటిమెంట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి కూడా ఫాలో అవుతున్నారు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పూరి ఈ సినిమాని రేపు నర్సీ పట్నంలో ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు. అందుకోసం ఆయన నర్సీ పట్నం బయలుదేరారు. ఈ సినిమా పై పూర్తి నమ్మకంతో ఉన్న పూరి జగన్నాథ్ కి తన సెంటిమెంట్ కూడా సాయపడి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.

తాజా వార్తలు