“పుష్ప”లో ఓ క్రేజీ సీన్..సుక్కు గట్టి ప్లానే వేసినట్టు ఉన్నారు!

“పుష్ప”లో ఓ క్రేజీ సీన్..సుక్కు గట్టి ప్లానే వేసినట్టు ఉన్నారు!

Published on Feb 12, 2021 11:00 AM IST

మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జు కాంబో అంటేనే కాస్త స్పెషల్ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలకు కూడా అందని రేంజ్ లో చేస్తున్న హ్యాట్రిక్ సినిమానే “పుష్ప”. ఇటీవల మేకర్స్ ఇస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే వీరి కాంబో నుంచి అదిరిపోయే సినిమా రావడం గ్యారంటీ అనిపిస్తుంది.

అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఒక క్రేజీ సన్నివేశం కోసమే సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాలో ఓ సీన్ ను ఏకంగా 500 మందితో ఓ కొండపైన తెరకెక్కించమని దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.

అంత మందితో అంటే ఏదో సాలిడ్ సన్నివేశమే అయ్యి ఉంటుంది అని ఖచ్చితంగా అర్ధం అవుతుంది. మరి అది ఫైట్ సీనా లేక సుకు మార్క్ తరహా సీనా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం సుకుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు