పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. మరి ఇద్దరు టాప్ హీరోలు కూడా ఇప్పుడు తమ తమ భారీ ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్నారు. అయితే మరి ఈ ఇద్దరి స్టార్ హీరోస్ తో మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే.
మరి వీటిపై లేటెస్ట్ గా ఇద్దరు హీరోల అభిమానులకు కూడా అదిరే క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ మధ్య ఓకే అయ్యింది మళ్ళీ ఎందుకు మూగబోయింది దీనితో ఈ సినిమా ఉన్నా తప్పిపోయిందా అన్న సంశయంలో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ఉంది చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేసారు.
మరి అలాగే ఎప్పుడో పవన్ తో కన్ఫర్మ్ చేసుకున్న ప్రాజెక్ట్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేయబోయేది గబ్బర్ సింగ్ ను మించి అయితే ఉంటుంది కానీ ఎక్కడా తగ్గదని అదిరే ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రం ఉంటుంది అని వారు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి మాత్రం ఈ రెండు సినిమాలపై అభిమానులకు ఒక స్పష్టత వచ్చేసింది అని చెప్పాలి.