యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో అథర్వ మురళీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా రవీంద్ర మాధవ తెరకెక్కించిన చిత్రం ‘టన్నెల్’. ఈ మూవీని తెలుగులోbలచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ. రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఎ. రాజు నాయక్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే..
‘టన్నెల్’ మూవీని చూశారా?
‘టన్నెల్’ మూవీని చెన్నైలో చూశాను. టీజర్, ట్రైలర్ వచ్చిన తరువాత ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. కథ కొత్తగా ఉంది కదా? అని ఇలాంటి సినిమాను తెలుగు వారికి అందించాలని అనుకున్నాను. అందుకే చెన్నైకి వెళ్లి ప్రత్యేకంగా సినిమాను వీక్షించాను. నాకు చిత్రం విపరీతంగా నచ్చింది. అందుకే తెలుగులోకి తీసుకు వస్తున్నాను.
‘టన్నెల్’లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి?
‘టన్నెల్’ మూవీ కథ చాలా కొత్తగా ఉంటుంది. కథ అంతా కూడా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. పోలీసుల్ని హీరో ఎలా కాపాడతాడు? సైకోని ఎలా పట్టుకుంటాడు? టన్నెల్‌కి ఈ కథకు సంబంధం ఏంటి? అన్న పాయింట్లను ఆసక్తికరంగా మలిచాడు. సీటు ఎడ్జ్ థ్రిల్లర్‌గా ‘టన్నెల్’ ఉంటుంది.
లచ్చురామ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
నా బ్యానర్‌లో ఇది వరకు దమ్మున్నోడు, స్వేచ్ఛ అనే చిత్రాలు నిర్మించాను. త్వరలోనే ‘శ్రీ గాంధారి’ అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. ఇంకా కొన్ని చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు మా ఫోకస్ అంతా కూడా ‘టన్నెల్’ మీదే ఉంది. ఈ మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను.
‘టన్నెల్’ గురించి ఆడియెన్స్‌కి ఏం చెబుతారు?
‘టన్నెల్’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా చూసిన ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు. యాక్షన్, లవ్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల అంశాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. తెలుగు వారందరినీ ‘టన్నెల్’ మెప్పిస్తుందని నమ్మకంగా ఉన్నాను.