నెరవేరిన ప్రియ ఆనంద్ చిరకాల కోరిక


ప్రియ ఆనంద్ జీవిత కాలం కల నిజమయ్యింది శ్రీదేవి చిత్రాలను ఇష్టపడటం మొదలు పెట్టినప్పటి నుండి తను ఏదో ఒకరోజు శ్రీదేవిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుంటానని కలలుకనే దానిని అని ప్రియ చెప్పింది. గౌరీ షిండే, శ్రీ దేవి తిరిగి తెర మీద కనిపించనున్న చిత్రం “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రంలో కీలక పాత్ర కోసం ప్రియ ఆనంద్ ను ఎంచుకున్నప్పుడు ఆమె మేఘాల్లో తేలిపోయింది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వద్ద మాట్లాడుతూ ” న్యూ యార్క్ లో చిత్రీకరణ జరుపుకున్నపుడు తనతోనే చాలారోజులు గడిపిన ఆమెను ఆటోగ్రాఫ్ అడగడానికి ధైర్యం సరిపోలేదు. తరువాత మళ్ళీ కలుస్తానని అనుకోలేదు ఈ కార్యక్రమం సందర్భంగా ఆమెని నేను అడుగుతున్నాను ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని” అని ప్రియ ఆనంద్ అడిగారు. శ్రీదేవి తన అభ్యర్ధనను ఒప్పుకున్నపుడు తన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.”ఎట్టకేలకు శ్రీదేవి గారి ఆటోగ్రాఫ్ దొరికింది దీనికోసం నేను నా చిన్నతనమంతా వేచి చూసాను ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రానికి కృతజ్ఞతలు” అని ట్విట్టర్లో చెప్పారు ఈ చిత్రం కాకుండా త్వరలో ప్రియ ఆనంద్ ప్రియ దర్శన్ దర్శకత్వంలో “రంగ్రేజ్” మరియు అనిష్ కురువిల్ల “కో అంటే కోటి” చిత్రంలో కనిపించనుంది.

Exit mobile version