ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకి ఐకానిక్ స్టెప్స్ కంపోస్ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. ఎన్. టి.ఆర్ కి ‘నాచోరే’, రామ్ చరణ్ కి ‘బంగారు కోడిపెట్ట’ పాటలకు కంపోస్ చేసిన ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కోసం మన యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.
మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘దేనికైనా రెడీ’. ఈ చిత్రంలో మంచు విష్ణుకి ప్రేమ్ రక్షిత్ అదిరిపోయే స్టెప్స్ కంపోస్ చేసారు. ఈ విషయంపై విష్ణు మాట్లాడుతూ ‘ చాలా రోజుల తర్వాత మళ్ళీ నాలోని డాన్సింగ్ స్కిల్స్ చూపించే అవకాశం ఈ సినిమాలో వచ్చింది. ఈ సందర్భంగా సూపర్బ్ స్టెప్స్ కంపోస్ చేసిన ప్రేమ్ రక్షిత్ కి నా ధన్య వాదాలు. కొంచెం కష్ట తరంతో కూడుకున్న స్టెప్స్ కంపోస్ చేసాడు, కానీ నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసాను. ఈ సినిమాతో నాకు ఒక మంచి డాన్సర్ గా గుర్తింపు వస్తుంది’ అని ఆయన అన్నారు.
విష్ణు మరియు హన్సిక జంటగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 24న విడుదల కానున్న ఈ సినిమాలో కమెడియన్స్ బ్రహ్మానందం మరియు ఎం.ఎస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు.