CSKకి ధోని.. TVKకి నేను – ప్రశాంత్ కిషోర్

తమిళ హీరో విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన గతేడాది ‘తమిళగ వెట్రి కళగం’(TVK) అనే పార్టీని సొంతంగా స్థాపించాడు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. ఇక ప్రస్తుతం తన పార్టీని బలోపేతం చేసేందుకు విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. తాజాగా తన పార్టీ వార్షికోత్సవ సభను విజయ్ ఘనంగా నిర్వహించారు.

ఈ సభకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్‌కి తన సహాయ సహకారం అవసరం లేదని.. అయినా, విజయ్ కోసమే తాను ఈ సభకు వచ్చినట్లు తెలిపారు. ఇక తమిళనాడులో ధోనికి మంచి క్రేజ్ ఉంది. CSK టీమ్‌ను ధోని ఎలా అయితే గెలిపిస్తాడో.. విజయ్ TVK పార్టీని వచ్చే ఎన్నికల్లో తాను కూడా అదే విధంగా గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

విజయ్ పార్టీని గెలిపించి తాను ధోని కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళ ప్రజలు మార్పు కోరకుంటున్నారని.. విజయ్ పార్టీని గెలిపిస్తే ఆ మార్పు తప్పకుండా వస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version