సమీక్ష: ‘డీయస్ ఈరే’ – కొంతమేర మెప్పించే హారర్ థ్రిల్లర్

సమీక్ష: ‘డీయస్ ఈరే’ – కొంతమేర మెప్పించే హారర్ థ్రిల్లర్

Published on Nov 8, 2025 2:09 PM IST

సినిమా పేరు : డీయస్ ఈరే

విడుదల తేదీ : నవంబర్ 07, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ప్రణవ్ మోహన్‌లాల్, సుష్మిత భట్, గిబిన్ గోపినాథ్, షైన్ టామ్ చాకో, జయ కురుప్ తదితరులు
దర్శకుడు : రాహుల్ సదాశివన్
నిర్మాత : చక్రవర్తి రామచంద్ర & S. శశికాంత్
సంగీత దర్శకుడు : క్రిస్టో జేవియర్
సినిమాటోగ్రాఫర్ : షెహనాద్ జలాల్ ISC
ఎడిటర్ : షఫీక్ మహమ్మద్ అలీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో గత వారం మలయాళంలో రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డీయస్ ఈరే’ కూడా ఒకటి. లెజెండరీ నటుడు మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా భ్రమయుగం దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక ఆర్కిటెక్ అయినటువంటి రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కని (సుష్మిత భట్) ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె ఇంటికి వెళ్తాడు. అలా వెళ్లి తన ఇంటికి వచ్చేసాక అక్కడ నుంచి తన చుట్టూ పరిస్థితులు స్ట్రేంజ్ గా మారి తనకి ఇబ్బందికరంగా మారుతాయి. దీనితో కని పక్కింటిలో ఉండే మధు (గిబిన్ గోపినాథ్) సాయంతో కనినే తనని దయ్యంగా మారి ఇబ్బంది పెడుతుంది అని సాయం కోరుతాడు. తర్వాత వీరి ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజం ఏంటి? నిజంగా రోహన్ ని ఇబ్బంది పెడుతుంది కని ఆత్మేనా లేక మరొకరా? అసలు కని ఎందుకు చనిపోయింది? ఈ మొత్తంలో ఫిలిప్, మను ఎవరు? చివరికి ఆ ఆత్మ నుంచి రోహన్ బయట పడ్డాడా లేదా అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమా దర్శకుడు రాహుల్ సదాశివన్ కోసం బేసిక్ ఐడియా ఉన్న తెలుగు ఆడియెన్స్ కి తన సైడ్ నుంచి అక్కడక్కగా మంచి సస్పెన్స్ ఇంకా థ్రిల్ మూమెంట్స్ ని తాను అందించే ప్రయత్నం చేసారని చెప్పాలి. సీన్ కి సీన్ కి తాను డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే ఇంకా అక్కడక్కడా మైంటైన్ చేసిన టెంపో సినిమాలో బాగుంది. చాలా నాచురల్ గా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా సినిమాలో మెప్పిస్తుంది.

అలాగే పలు హారర్ మూమెంట్స్ జెనరల్ ఆడియెన్స్ కి థ్రిల్ కలిగించవచ్చు. అంతేకాకుండా సెకండాఫ్ లో కొన్ని నిమిషాల పాటుగా కథనం ఇంట్రెస్ట్ గా సాగుతుంది. అలా కథనంలో వచ్చే ఓ ట్విస్ట్ అలాగే చివరి 20 నుంచి 25 నిమిషాలు ఇంకా క్లైమాక్స్ లో ఇచ్చిన హారర్ లీడ్ ఇంప్రెస్ చేసాయి. ఇక మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ సినిమాలో మంచి నటన కనబరిచాడు.

తన లుక్స్ పరంగా బాగున్నాడు అలాగే సీన్స్ లోని పరిస్థితికి బట్టి నాచురల్ పెర్ఫామెన్స్ ని తాను అందించాడు అని చెప్పాలి. ఇక తనకి సహాయ నటుడుగా కనిపించిన గిబిన్ గోపినాథ్ కూడా ఉన్నంతలో తన రోల్ లో బాగా చేశారు. కొన్ని టెన్స్ సీన్స్ లో తన నటన బాగుంది. ఇక వీరితో పాటుగా క్లైమాక్స్ లో ఎల్సమ్మగా నటించిన జయ కురుప్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించారు అని చెప్పాలి. క్లైమాక్స్ లో ఆమె నటన, తనపై యాక్షన్ లేయర్ మెప్పిస్తాయి.

మైనస్ పాయింట్స్:

కంప్లీట్ గా ఒక సాలిడ్ హారర్ థ్రిల్లర్స్ మంచి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్, లాజికల్ గా సాగే ట్విస్ట్ లు లాంటి వాటిని ఇష్టపడే వారికి అయితే ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించదు. నిజ జీవిత సంఘటలు ఆధారంగా తెరకెక్కించినప్పటికీ కొన్ని ప్రశ్నలు మాత్రం లాజిక్ లేకుండానే మిగిలిపోయినట్టు అనిపిస్తుంది.

సినిమాలో ట్విస్ట్ బాగానే ఉంది కానీ దానికి అనుగుణంగా చూపించిన సీన్స్ కి లాజిక్ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. దయ్యం ఇతరులని ఎందుకు ఇబ్బంది పెట్టింది? కని ఎలా చనిపోయింది లాంటి సీన్స్ ని చూపించలేదు. వాటి వెనుక డీటెయిల్స్ ప్రశ్నగానే ఉండిపోయాయి. అంతేకాకుండా హీరోతో కూడా సీన్స్ కూడా మొదట కారణం ఒకటి అనుకుంటాం కానీ తర్వాత అది వేరే అని తెలుస్తుంది.

ఆ వేరే కారణంలో కూడా లాజిక్ ఉండదు. అలాగే సినిమాలో మరీ అంత భయపెట్టించేసే హారర్ మూమెంట్స్ పెద్దగా లేవు. హారర్ సినిమాలు తక్కువ చూసేవారికి ఒకింత భయం కలగొచ్చు ఏమో కానీ రెగ్యులర్ గా చూసేవారికి ఆ సన్నివేశాలు చాలా రొటీన్ గా పెద్దగా భయం లేకుండానే ఉంటాయి.

ఇక వీటితో పాటుగా క్లైమాక్స్ కి వచ్చేసరికి అసలు దయ్యం ఎవరు? దాని వెనుక ఉన్న కారణం లాంటివి అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇక ఇలాంటి సినిమాల్లో సంగీతం ఎంత బాగుంటే ఆడియెన్స్ లీనం అయ్యేందుకు తోడ్పడుతుంది కానీ ఇందులో సంగీతం ఆల్రెడీ విన్న స్కోర్ నే గుర్తొస్తుంది. దాదాపు కాంచన సిరీస్ కి థమన్ ఇచ్చిన స్కోర్ గుర్తు రాక మానదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. కావాల్సిన ప్రొడక్షన్ డిజైన్, సెటప్ ని చాలా బాగా చేసుకున్నారు. సంగీతం అంత ఎఫెక్టీవ్ గా లేదు కానీ కెమెరా వర్క్ మాత్రం సినిమాలో బాగుంది. కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది.

ఇక దర్శకుడు రాహుల్ సదాశివన్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకి కొంతమేర మెప్పిస్తుంది. యదార్థ సంఘటలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినప్పటికీ కొన్ని ప్రశ్నలు అలానే ఉంచేసినట్టు అనిపిస్తుంది. లాజిక్స్ ని మిస్ అయ్యారు. అలాగే కొన్ని చోట్ల కథనం, సెకండాఫ్ లో డీసెంట్ గా మైంటైన్ చేశారు. కానీ మిగతా అంతా సో సో గానే అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘డీయస్ ఈరే’ చిత్రం కొంతమేర అక్కడక్కడా ఓకే అనిపించే హారర్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్స్ లో సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే కొన్ని థ్రిల్ మూమెంట్స్ కూడా పర్వాలేదు. కానీ ఇది పూర్తి స్థాయిలో మెప్పించేసే హారర్ థ్రిల్లర్ అయితే కాదు. మెయిన్ గా లాజికల్ గా సినిమాలో సీన్స్ లేవు ఇవైతే ప్రశ్నలు గానే ఉంటాయి. సో ఈ చిత్రం కొన్ని మూమెంట్స్ వరకు పర్లేదు అనిపిస్తుంది. .

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here Foe English Review

తాజా వార్తలు