మిర్చిగా రానున్న ప్రభాస్

మిర్చిగా రానున్న ప్రభాస్

Published on Oct 18, 2012 8:00 AM IST


యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “వారధి” ఇకనుండి “మిర్చి” గా మారనుంది. అదేనండి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “మిర్చి” అనే పేరు అయితే బాగుంటది అని ఈ పేరు ఎంచుకున్నారు. యు వి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం ఇప్పటికే చిత్రీకరణ జరిగింది ఇప్పుడు ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మధ్యనే రిచా మరియు ప్రభాస్ ల మీద ఒక పాటను చిత్రీకరించారు ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం జనవరిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రంతో కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఈయన చాలా చిత్రాలకు రచయితగా పని చేశారు.

తాజా వార్తలు