ప్రభాస్ మరో మహా యాగం మొదలైంది.!

ప్రభాస్ మరో మహా యాగం మొదలైంది.!

Published on Feb 2, 2021 8:59 AM IST

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరిన్ని భారీ పాన్ ఇండియన్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఏక కాలంలోనే రెండేసి సినిమాలు చేసేస్తూ మరింత బిజీ అయ్యిపోయాడు. అలా మొన్ననే యాక్షన్ థ్రిల్లర్ ను స్టార్ట్ చేసేసి అందులో బిజీగా ఉండడమే కాకుండా బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి మహా యాగం ప్రాజెక్ట్ బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న “ఆదిపురుష్” అనే చెప్పాలి.

భారీ ఇతిహాస చిత్రంగా దీనిని తెరకెక్కిస్తుండడంతో దేశ వ్యాప్తంగా దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. రాముని పాత్రలో ప్రభాస్ రావణ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం షూట్ ఈరోజే ముంబైలో మొదలయ్యినట్టుగా దర్శకుడు ఓంరౌత్ సింపుల్ గా అనౌన్సమెంట్ ఇచ్చి కన్ఫర్మ్ చేశారు. కొన్ని రోజుల కితమే ఈ చిత్రం తాలుకా మోషన్ క్యాప్చర్ పనులు కూడా మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. మరి ఈ భారీ విజువల్ వండర్ ను ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు