ఈ దర్శకునితో ప్రభాస్ సినిమా ఆగిపోలేదా.?

ఈ దర్శకునితో ప్రభాస్ సినిమా ఆగిపోలేదా.?

Published on Aug 23, 2020 10:38 PM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. ఒక్క మన దక్షిణాది ఇండస్ట్రీలోనే కాకుండా ఉత్తరాది ఆడియెన్స్ లో భారీ ఫాలోయింగ్ ను సంతరించుకొని వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో దూసుకెళ్ళిపోతున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మూడు చిత్రాల్లో డైరెక్ట్ బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్”. కానీ ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యక ముందే మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయనున్నారని టాక్ వచ్చింది. అతనే ప్రశాంత్ నీల్.

నీల్ తో ప్రభాస్ సినిమా ఖాయమే అని గట్టి బజే వినిపించిన తరుణంలో ఆదిపురుష్ వచ్చి ఈ క్రేజీ కాంబోను వెనక్కి నెట్టింది. దీనితో ఈ భారీ చిత్రం ఆగిపోయిందనే అనుకున్నారు కానీ లేటెస్ట్ టాక్ ఏమిటటంటే ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోలేదట. వాయిదా పడిందని మాత్రమే తెలుస్తుంది. బహుశా ఈ మూడు చిత్రాలు అయ్యాకే ఉంటుందని కూడా మరో వెర్షన్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం గత కొన్ని రోజుల నుంచి మన టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ల పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు