మరొక భారీ బ్లాక్ బస్టర్ ను లోడ్ చేస్తున్న ప్రభాస్

మరొక భారీ బ్లాక్ బస్టర్ ను లోడ్ చేస్తున్న ప్రభాస్

Published on Aug 17, 2020 10:15 PM IST

బాహుబలి హీరో ప్రభాస్ మరొక భారీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రేపు ఉదయం తన కొత్త చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ను సైతం ప్రభాస్ ఇన్ స్టాగ్రం లో పోస్ట్ చేశారు.బాహుబలి ప్రభాస్,దర్శకుడు ఓం రౌత్ తో ఒక భారీ సినిమా ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ పోస్ట్ చేసిన వీడియో ను దర్శకుడు ఓం రౌత్ కూడా పోస్ట్ చేశారు. ఇందులో “వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఇంది. హాయ్ ప్రభాస్, ఆర్ యూ రెడీ ఫర్ టుమారో అని దర్శకుడు ఓం రౌత్ అనగా, ఆల్ ఎక్సైటెడ్, ఫింగర్స్ క్రాస్డ్ అంటూ ప్రభాస్ అన్నారు. లెట్స్ డు ఇట్ అంటూ ఇద్దరు ఎంతో ఎగ్జైటడ్ గా అన్నారు. అయితే ఈ దర్శకుడు తన్హాజీ అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ప్రభాస్ సైతం వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూసుకు పోతున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ తో మరొక చిత్రం చేస్తుండగానే ఓం రౌత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ తాజా చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు రేపు ఉదయం తెలియనున్నాయి.

https://www.instagram.com/p/CD_jO3GJu_Q/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు