కొంత సేపటి క్రితమే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ చాలా డాషింగ్ గా ఉన్నాడు. ఈ ఫోటో లోని ప్రభాస్ లుక్ ని ప్రభాస్ అభిమానులు మరియు సినీ అభిమానులు ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకి ముందే మంచి బిజినెస్ జరుపుకుంటోంది మరియు ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది.
జె.భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కూడా లారెన్స్ గారే అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ ఎక్కువ భాగం బ్యాంకాక్ లో జరిగింది, మిగిలిన భాగం ఇండియా మరియు ఇతర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది.