యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారధి’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఫెయిల్ మాస్టర్ అనల్ అరసు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సెట్ వేసి భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకుడిగా మారి రూపొందిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.