‘కాంతార 1’ పై ప్రభాస్ బ్లాక్ బస్టర్ రివ్యూ వైరల్!

‘కాంతార 1’ పై ప్రభాస్ బ్లాక్ బస్టర్ రివ్యూ వైరల్!

Published on Oct 3, 2025 12:03 AM IST

కన్నడ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించగా తానే హీరోగా కూడా నటించారు. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ కావడమే కాకుండా మన స్టార్స్ నుంచి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంటుంది. ఇలా లేటెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి కూడా సాలిడ్ రివ్యూ దీనికి వచ్చేసింది.

ప్రభాస్ కాంతార 1 ని బ్రిలియెంట్ గా ఉందని కొనియాడాడు. ప్రతీ ఒక్కరూ అద్భుతమైన పెర్ఫామెన్స్ లని అందించారు అని ఈ ఏడాదికి ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రభాస్ ఎగ్జైటెడ్ పోస్ట్ చేసి చిత్ర యూనిట్ కి రిషబ్ శెట్టికి కంగ్రాట్స్ తెలిపాడు. దీనితో మేకర్స్ ప్రభాస్ రివ్యూ షేర్ చేసుకొని థాంక్స్ చెప్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి రెబల్ రివ్యూ మాత్రం ఇప్పుడిలా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు