ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండగా అనౌన్సమెంట్ తోనే ఈ సినిమాని ఓ రేంజ్ లో తీసుకెళ్లి పెట్టారు. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ తన బెస్ట్ ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ని చాలా సైలెంట్ గా పూర్తి చేసేస్తున్న బన్నీ జిమ్ లో కూడా గట్టిగా కష్టపడుతున్నాడు.
రీసెంట్ గా తన నుంచి జిమ్ నుంచి తన ఫోన్ వాల్ పేపర్ నే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఈ హార్డ్ వర్క్ అంతా తన సినిమా యాక్షన్ షెడ్యూల్ కోసం అన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్టన్నింగ్ ఫిజిక్ ని బన్నీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. మరి తాను 6 ప్యాక్ బాడీలో మరోసారి కనిపించినా ఎలాంటి ఆశ్చర్యం లేదనే వినిపిస్తుంది. సో దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


