ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న అల్లరి నరేష్ హారర్ సినిమా!

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న అల్లరి నరేష్ హారర్ సినిమా!

Published on Nov 20, 2025 10:06 AM IST

12A-Railway-colony

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అందరి హీరోస్ అభిమానులకి కామన్ గా ఇష్టమైన అతి కొద్ది మంది హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. మరి అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ’12 ఏ రైల్వే స్టేషన్’. సాలిడ్ హారర్ థ్రిల్లర్ హిట్ చిత్రాలు మా ఊరి పొలిమేర సినిమాల దర్శకుడు అనీల్ విశ్వనాథ్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి దర్శకుడు నాని కసరగడ్డ తెరెకక్కించారు.

మరి రేపు గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకుంది. ఈ సినిమా హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నారు. సో ఈ హారర్ థ్రిల్లర్ థియేటర్స్ లో రిలీజ్ తర్వాత అప్పుడు విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా పొలిమేర నటి కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

తాజా వార్తలు