మన తెలుగు సినిమా నుంచే కాదు టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ చరిష్మా కలిగిన కటౌట్ ఎవరైనా ఉన్నారు అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబే అని చెప్పాలి. మహేష్ లుక్స్ కి తన పర్సనాలిటికి తనని అంతర్జాతీయ స్థాయి సినిమాల్లో చూడాలి అనే మాట ఇప్పుడు నుంచి ఉన్నది అయితే కాదు.
కాని అందుకు ఒక సమయం, సందర్భం కావల్సి వచ్చాయి. మరి అవి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపంలో వచ్చాయి అని చెప్పాలి. ఇలా తన లేటెస్ట్ సినిమా వారాణసి తో హాలీవుడ్ లో కూడా ఈ సినిమా కోసం అంతా మాట్లాడ్డం మొదలు పెట్టారు. అయితే ఈ తర్వాత నుంచి హాలీవుడ్ ప్రముఖ సోషల్ మీడియాలలో మహేష్ బాబు కోసం పోస్ట్ లు పడటం జరుగుతున్నాయి.
ఇలా హోలీవుడ్ ఆడియెన్స్ లో మహేష్ బాబు రిజిస్టర్ అవ్వడం మొదలైంది. ముఖ్యంగా మహేష్ బాబు జాన్ విక్ హీరోని తలపించేలా కనిపిస్తుండడంతో మరింత చర్చకు దారి తీస్తుంది. సో ఇది మహేష్ బాబు తన హాలీవుడ్ ఎంట్రీకి జస్ట్ ఆరంభం మాత్రమే అని చెప్పాలి.


