మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా చికిరి చికిరి అంటూ వచ్చిన మొదటి పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా లేటెస్ట్ గా మరో రేర్ ఫీట్ ని సెట్ చేసి ర్యాంపేజ్ చూపిస్తుంది.
వరల్డ్ పాపులర్ మ్యూజిక్ ఛార్ట్స్ లో ఒకటైన బిల్ బోర్డ్స్ ఇండియాకి గాను మొత్తం ఇండియా లోనే ఈ సాంగ్ ఆల్ టైం టాప్ 1 ప్లేస్ లో నిలిచి అదరగొట్టింది. ఇక ఓవరాల్ గా కూడా ఈ సాంగ్ 90 మిలియన్ కి పైగా వ్యూస్ ను యూట్యూబ్ లో అందుకొని టాప్ లో కొనసాగుతుంది. మరి ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న గ్లోబల్ గా సినిమా రిలీజ్ కి రాబోతుంది.



