పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా షూటింగ్ డిసెంబర్ 23న నుండి మొదలుపెట్టి మార్చి కల్లా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక భారీ సెట్ లో ముందుగా షూట్ చేయనున్నారు. అలాగే ఇక మిగిలిన షూటింగ్ మొత్తం ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం వేస్తోన్న కొత్త సెట్స్ లోనే పూర్తి చేయనున్నారని సమాచారం. నిజానికి ఈ సినిమా మధ్యలో అగకపోయి ఉంటే ఎప్పుడో పూర్తి అయి ఉండేది. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు మధ్యలోనే ఆగి.. దాదాపు రెండు సంవత్సరాలు ఆలస్యం అయింది ఈ సినిమా.
ఇక పవర్ స్టార్ కూడా అటు రాజకీయాలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ ముందుకువెళ్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ షూట్ ను నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. క్రిష్ – పవన్ సినిమాను వచ్చే విజయదశమి పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.