గత ఏడాది సినీ రంగానికే ఎంత నష్టం వాటిల్లిందో ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. కారణం ఏదైనప్పటికీ మాత్రం పలువురు ప్రముఖ నటులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదంగా మారాయి. అయితే ఇప్పుడు తమిళ నాట టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటుడు ఇంద్రకుమార్ ఆత్మ హత్య చేసుకున్న ఘటన అక్కడ విషాదాన్ని నెలకొల్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే ఇంద్రకుమార్ ఓ క్యాంప్ నుంచి తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు కానీ అనూహ్యంగా ఉరి వేసుకొని కనిపించాడని పోలీసులు చెప్తున్నారు. అలాగే ఇంకా ఇతర కారణాల కోసం కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. పలు టీవీ ప్రోగ్రామ్స్ మరియు సినిమాల్లో పని చేసిన ఇంద్రకుమార్ కు భార్య పిల్లలు కూడా ఉన్నారు. మరి అతని ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు టీం తరపున సంతాపం తెలియజేస్తున్నాం.