మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. టీజర్ తో సెన్సేషన్ ను నమోదు చేసేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ రోల్ కు గాను ఫీమేల్ లీడ్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ రోల్ ఈ సినిమాలో ఎక్కువ నిడివి ఉండకపోయినప్పటికీ పూజా ఎక్కువగానే డిమాండ్ చేస్తుందట. ఆ రోల్ కు గాను పూజా కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టుగా టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే టీజర్ కోసమే మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సాలిడ్ చిత్రానికి మేకర్స్ మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.