బాలీవుడ్ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకునే నటీ నటులు ఎవరికైనా ఉండే కామన్ గోల్ ముంబైలో ఫ్లాట్ కొనడం. అందునా ఖరీదైన బాంద్రా ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్క సెలబ్రిటీ అనుకుంటారు. ఇప్పటికే అక్కడ బాలీవుడ్ స్టార్ నటీనటులు అందరికీ ఇళ్ళు ఉన్నాయి. ఇప్పడూ వారి జాబితాలోకి పూజ హెగ్డే కూడ చేరిపోయింది.
పూజా ఇటీవలే బాంద్రాలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అది కూడ సీఫేసింగ్ ఫ్లాట్ కావడం విశేషం. ఇందులో మూడు బెడ్ రూమ్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయట. ఈ ఫ్లాట్ ఖరీదు కోట్లలోనే ఉంటుంది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణీ అవుతోంది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, చిరు, చరణ్ చేస్తున్న ‘ఆచార్య’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లో పూజా నటిస్తోంది. ఇవి కాకుండా ఇంకో రెండు పెద్ద సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక హిందీలో అయితే సల్మాన్ ఖాన్, రన్వీర్ సింగ్ లాటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది పూజా. తెలుగులో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో పూజా ప్రథమ స్థానంలో ఉంది.