రామ్ చరణ్ పై పోలీస్ కేసు..!

రామ్ చరణ్ పై పోలీస్ కేసు..!

Published on Apr 3, 2014 11:59 AM IST

ram_charan

సినిమాకి సంబందించిన స్టార్ హీరోలు కొన్ని సార్లు తమకు తెలిసి ఏమన్నా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే చాలా సార్లు మాత్రం తమకు తెలియకుండానే పోలీస్ కేసు సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇదే విధంగానే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కేసు నమోదైంది. దీనికి కారణం రామ్ చరణ్ ఫ్లెక్సీలు, బ్యానర్స్..

అసలు విషయంలోకి వెళితే.. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అభిమానులు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేసారు. కానీ వాటిని పెట్టడానికి జిహెచ్ఎంసి నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. అలాగే బర్త్ డే ఈవెంట్ అయిపోయాక కూడా వాటిని తీయక పోవడంతో వాటివల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్న వారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో రామ్ చరణ్ పై కేసు ఫైల్ చేసారు.

ప్రస్తుతానికి రామ్ చరణ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విషయంపై ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మరోవైపు కేసు పెట్టిన వారిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు