ఫోటో మూమెంట్: పద్మభూషణ్ అజిత్ తో షాలిని అజిత్ కుమార్

ఫోటో మూమెంట్: పద్మభూషణ్ అజిత్ తో షాలిని అజిత్ కుమార్

Published on Apr 29, 2025 9:00 AM IST

తమిళ స్టార్ నటుడు అలాగే అనేక రంగాల్లో అపారమైన టాలెంట్ ఉన్న హీరో అజిత్ కుమార్ రీసెంట్ గానే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిక్ ఇంకా కంప్లీట్ కాకుండానే తను పద్మభూషణ్ అవార్డు కూడా అందుకోవడం తన అభిమానులకు మరింత ఆనందంగా మారింది.

ఇక లేటెస్ట్ గా స్టైలిష్ లుక్స్ లో అజిత్ తన పద్మ పురస్కారం అందుకోగా తనతో పాటుగా తన భార్య షాలిని అజిత్ కుమార్ కలిసి దిగిన పిక్ ఇపుడు బ్యూటిఫుల్ మూమెంట్ గా మారింది. మరి ఇద్దరూ కూడా బ్లాక్ ఔట్ ఫిట్స్ లో పర్ఫెక్ట్ కపుల్ గా కనిపిస్తుండగా ఈ పిక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత మళ్ళీ ఆ సినిమా దర్శకుడే అధిక్ రవిచంద్రన్ కి అవకాశం ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు