ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!

ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!

Published on Sep 17, 2025 3:59 PM IST

Modi-and-Mukundhan

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. మరి ఇదే ప్రత్యేక రోజున మోడీపై ఓ గ్రాండ్ బయోపిక్ గా “మా వందే” పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమాలో హీరోగా నటుడు ఉన్ని ముకుందన్ మోడీ పాత్రని చేయనున్నట్టుగా అనౌన్స్ అయ్యింది.

అయితే ఈ తర్వాత వీరి కలయికలో కొన్ని పిక్స్ స్పెషల్ మూమెంట్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నరేంద్ర మోడీని కలిసి శ్రీకృష్ణుని ప్రతిమని తాను అందించి కాసేపు ముచ్చటించిన విజువల్స్ మంచి ఫోటో మూమెంట్ గా కూడా మారాయి. ఉన్ని ముకుందన్ మాత్రమే కాకుండా మా వందే టీం అంతా కూడా మోడీని కలిసి విష్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రీల్ మోడీ రియల్ మోడీ కలిసి ఉన్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు