వర్మ సినిమా మీద హై కోర్టులో పిటీషన్

వర్మ సినిమా మీద హై కోర్టులో పిటీషన్

Published on Feb 27, 2013 4:00 PM IST

26.11-India-Pai-Dadi

రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన అందులో వివాదం లేదా ఏదో ఒక సంచలనం ఉంటాయి. ఎప్పుడు వార్తల్లో ఉండే ఈ దర్శకుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన లేటెస్ట్ మూవీ 26/11 ఇండియా పై దాడి సినిమా విడుదల నిలిపివేయాలంటూ హై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీగల రామ్ ప్రసాద్ అనే న్యాయవాది హై కోర్టులో పిటీషన్ వేశారు. ఈ సినిమా విడుదలైతే ముంబై దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలు మానసిక క్షోభకి గురవుతాయని, ఈ సినిమాకి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం వ్యతిరేకమని పిటీషన్లో పేర్కొన్నారు. పిటీషన్ స్వీకరించిన హైకోర్ట్ విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

తాజా వార్తలు