గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ రూరల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ పాత్రలో నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు.
అయితే, ఈ చిత్ర షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ నాసిక్‌లో జరగనుంది. అక్టోబర్ చివరినాటికి.. లేదా నవంబర్ లోగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను ఢిల్లీ స్టేడియంలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట.
దీంతో పెద్ది ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27, 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.