డేట్ కి వెళ్ళను కార్తికేయ జస్ట్ ఫ్రెండ్- పాయల్

డేట్ కి వెళ్ళను కార్తికేయ జస్ట్ ఫ్రెండ్- పాయల్

Published on Apr 26, 2020 9:58 PM IST


టాలీవుడ్ కి ఆర్ ఎక్స్ 100 తో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మొదటి హీరో కార్తికేయ . వీరిద్దరి కాంబినేషన్ ఆ చిత్రంలో బాగా సెట్ కావడంతో పాటు, కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పాయల్ రాజ్ పుత్ కెరీర్ లో అతిపెద్ద హిట్ కూడా ఆర్ ఎక్స్ 100 కావడం విశేషం. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న పాయల్ అభిమానులతో సరదాగా సోషల్ మీడియాలో చాట్ చేశారు. దీనితో ఓ అభిమాని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు.

తెలుగులో మీ మొదటి హీరో అయిన కార్తికేయతో డేట్ కి వెళతారా అని అడుగగా, కార్తికేయ జస్ట్ నాకు మంచి మిత్రుడు, అతనితో డేట్ కి వెళ్ళను అన్నారు. ఇక టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ చిత్రంలో నటించాలని ఉంది అని పాయల్ చెప్పడం విశేషం. పాయల్ తన నెక్స్ట్ మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు