‘తమ్ముడు’ ఫస్ట్ సింగిల్ కి డేట్, టైం ఫిక్స్!

‘తమ్ముడు’ ఫస్ట్ సింగిల్ కి డేట్, టైం ఫిక్స్!

Published on Jun 15, 2025 1:10 PM IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఫీమేల్ లీడ్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటడ్ చిత్రమే “తమ్ముడు”. రీసెంట్ గానే వచ్చిన ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సహా జెనరల్ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మామూలుగా ఏ సినిమాకి అయినా పాటలు, టీజర్ లాంటివి వచ్చాక ట్రైలర్ వస్తుంది కానీ ఈ సినిమాకి ట్రైలర్ తర్వాత ఫస్ట్ సింగిల్ రాబోతుంది.

ఇలా ఫస్ట్ సాంగ్ ఈ జూన్ 17న సాయంత్రం 5 గంటలకి విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేసేసారు. భూ అంటూ భూతం అంటూ ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ 17 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా ఈ జూలై 4న రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు